Magazines

కమల్‌‌జిత్‌, సురుచి పసిడి గురి

3 గంటల క్రితం

Kamaljit and Suruchi Eye Gold
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

10మీ ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌‌డ్‌ టీమ్‌‌లో స్వర్ణం
రైఫిల్‌ 3 పొజిషన్స్‌‌లో సిల్వర్‌ మెడల్‌
అథ్లెటిక్స్‌‌లో ఓ సిల్వర్‌, రెండు కాంస్యాలు
కబడ్డీ జట్లకు పతకాలు ఖాయం

2026 ఆసియా క్రీడలు


నగోయా (జపాన్‌) ఆసియా క్రీడల్లో భారత్‌ ‌రెండో పసిడి పతకం సాధించింది. షూటింగ్‌‌లో స్టార్స్‌ ‌నిరాశ పరిచినా.. 10మీటర్ల ఎయిర్‌ ‌పిస్టల్‌ ‌మిక్స్‌డ్‌ ‌టీమ్‌ ‌విభాగంలో భారత్‌ ‌పసిడి పతకం సొంతం చేసుకుంది. కమల్‌‌జిత్‌, సురుచి ఇందర్‌ ‌సింగ్‌ ‌జోడీ బంగారు పతకం గురిపెట్టారు. పసిడి పోరులో 484.6 పాయింట్లతో కమల్‌‌జిత్‌, సురుచి ఆసియా రికార్డును బద్దలుకొట్టారు. ఈ ఏడాది ఉబ్బెకిస్తాన్‌ ‌షూటర్లు కమలోవ్‌, నిగినా నెలకొల్పిన రికార్డును పసిడి పతక గురితో బ్రేక్‌ ‌చేశారు. దక్షిణ కొరియా షూటర్లు 478తో సిల్వర్‌ ‌మెడల్‌ ‌సాధించగా, ఇరాన్‌ ‌షూటర్లు 415.8తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు. పురుషుల 50మీటర్ల రైఫిల్‌ 3 ‌పొజిషన్స్‌‌లో భారత త్రయం సిల్వర్‌ ‌మెడల్‌ ‌సాధించింది. ఏపీఎస్‌ ‌తోమర్‌, రుద్రాక్ష్‌ ‌పాటిల్‌, నీరజ్‌‌కుమార్‌‌లు రెండో స్థానంలో నిలిచి రజతం అందుకున్నారు. చైనా షూటర్లు 1766 (95) అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం కైవసం చేసుకోగా.. మనోళ్లు 1762 (94) ద్వితీయ స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా 1751 (87) కాంస్య పతకం సాధించింది.
​
గుల్వీర్‌ ‌సింగ్‌ ‌సిల్వర్‌ ‌రన్‌
అథ్లెటిక్స్‌‌లో గుల్వీర్‌ ‌సింగ్‌ ‌సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పురుషుల 10000మీటర్ల పరుగులో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌‌గా గుల్వీర్‌ ‌నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో గుల్వీర్‌ ‌సింగ్‌ 25 ల్యాప్‌‌ల రేసును 28 నిమిషాల 29.28 సెకండ్లలో ముగించాడు. బహ్రెయిన్‌ అథ్లెట్‌ ‌బిరహాను 28.27.51తో పసిడి పతకం ఎగరేసుకుపోయాడు. బహ్రెయిన్‌‌కే చెందిన ఆల్బర్ట్‌ 28.34.38తో కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల షాట్‌‌పుట్‌‌లో మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ ‌కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో ఇనుప గుండును 17.17 మీటర్లు విసిరిన మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ ‌మూడో స్థానంలో నిలిచింది. మరో భారత అథ్లెట్‌ ‌కృష్ణ జయశంకర మీనన్‌ 16.57 మీటర్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పోల్‌‌వాల్ట్‌‌లో భారత్‌‌కు తొలిసారి ఓ మెడల్‌ ‌దక్కింది. మహిళల పోల్‌‌వాల్ట్‌ ‌ఫైనల్లో బారానికా ఎలగోవన్‌ అద్బుతం చేసింది. 4.15 మీటర్లను క్లియర్‌ ‌చేసిన బారానికా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది.

మరో నాలుగు మెడల్స్‌ ‌ఖాయం
కబడ్డీలో భారత్‌‌కు కనీసం రెండు రజత పతాకాలు ఖాయం. మహిళల జట్టు 48-24తో నేపాల్‌‌పై గెలుపొంది ఫైనల్‌‌కు చేరుకుంది. పురుషుల జట్టు థాయ్‌‌లాండ్‌‌పై 66-28తో విజయం సాధించి పసిడి పోరులో అడుగుపెట్టింది. స్క్వాష్‌ ‌మిక్సడ్‌ ‌డబుల్స్‌‌లో జోత్స్న చిన్నప్ప, సెంతిల్‌ ‌కుమార్‌ ‌క్వార్టర్‌‌ఫైనల్లో విజయం సాధించి సెమీస్‌‌కు చేరుకుని పతకం ఖాయం చేశారు. టేబుల్ టెన్నిస్‌ ‌మిక్స్‌డ్‌ ‌డబుల్స్‌‌లో మనుశ్‌ ‌షా, దియా జోడీ సెమీస్‌‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్