వ్యవసాయ కళాశాలలో 111వ జయంతి వేడుకలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని ఆదివారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే. హేమంత్ కుమార్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, ప్రజాసేవ చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.






కామెంట్‌లు (0)