Magazines

గాంధీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

56 నిమిషాల క్రితం

Mahathma Gandhiji
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు బాబురావు

నవతెలంగాణ - నర్సింహులపేట 

గాంధీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు బాబురావు అన్నారు. శుక్రవారం మండలంలోని నరసింహపురం బంజర జిపీలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీబీ-జీ-రామ్‌-జీపై గ్రామసభ నిర్వహించి మాట్లాడారు. సత్యగ్రహమే ఆయుధంగా, అహింస, శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో సమాజ శ్రేయస్సుకు ప్రతీ పౌరుడు పాటుపడాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులను వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీలం లక్ష్మి, కార్యదర్శి ఉమేష్, వార్డు సభ్యులు రావణబోయిన సైదులు, గుగులోతు వీరన్న, వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్