నవతెలంగాణ-హైదరాబాద్: తాము కొడంగల్‌లో పెట్టే సభతో ముఖ్యమంత్రికి చెమటలు పడతాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్ బైపోల్స్‌లో వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారంమీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. త్వరలోనే కొడంగల్‌లో బీఆర్ఎస్ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చని.. సిరిసిల్లలో బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదన్నారు.సిద్దిపేట సభ తర్వాత కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ ఉంటుందని ప్రకటించారు. సిరిసిల్ల సభతో రేవంత్‌కు వచ్చిన మైలేజ్ కంటే నష్టమే ఎక్కువన్నారు. పార్టీలు మారటంతో దానం నాగేందర్‌పై ఖైరతాబాద్ ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోని వారు కూడా బైపోల్స్‌లో కసితో ఓటు వేస్తారన్నారు.






కామెంట్లు (0)