Magazines

డిగ్రీ కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

1 గంట క్రితం

Gandhiji
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్నూర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కొర్రి అశోక్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి అందించిన సేవలను, ఆయన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, మానవతా, విలువలను విద్యార్థులకు వివరించారు.గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని, సత్యం అహింసా మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్