- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
- రూ. 3 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల లాంటివని, వాటినే ప్రామాణికంగా తీసుకుంటూ రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాలన పట్ల మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోందని అన్నారు.
ఆదివారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు రూ. 3 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని 7, 9, 16, 19, 20, 23 వార్డుల్లో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ తో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇవి: 7వ వార్డులో రూ. 50 లక్షలు, 9వ వార్డు రూ. 41 లక్షలు, 16వ వార్డు రూ. 40 లక్షలు, 19వ వార్డు రూ. 50 లక్షలు, 20వ వార్డు రూ. 50 లక్షలు, 23వ వార్డు రూ. 50 లక్షలు కలిపి ఈ ఆరు వార్డుల్లో కలిపి మొత్తం రూ. 2.81 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయి ఆయా వార్డుల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు, బొంతు వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు విరివాడ అపర్ణ, నసీమా, కర్నాటి విజయకుమారి, మట్టా దేవజ్యోతి, తోట సుజలరాణి, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, జగన్నాథం శ్రీను, బండారు శరత్ చంద్ర, మట్టా ప్రసాద్, హకీమ్, పర్సా మానసతో పాటు కో-ఆప్షన్ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)