నవతెలంగాణ-వనపర్తి
వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ న్యూ కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు భీమ్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మృతుడి భీమ్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడు భీమ్ రెడ్డి సతీమణి రాధికకు ధైర్యం చెప్పారు. భీమ్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడు భీమ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
53 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)