Magazines

ఏడిఈ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పట్టణ కమిటీ నిరసన

03 సెప్టెంబర్, 2026

BRS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను

రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలనపై  మరియు యూరియా యాప్ ఎత్తివేయాలని, రైతుబంధు ఎకరానికి 15000 ఇవ్వాలని

 కోరుతూ ఆలేరు పట్టణంలో గురువారం టిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.

 కాలేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ రెండు పిల్లర్లను మరమ్మతులు చేసి రాష్ట్ర ప్రజలకు కాలేశ్వరం జలాలను అందించాలని, ఆలేరు పట్టణ బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు అగ్రికల్చర్ ఏడిఈ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఏడిఈ కి వినతి పత్రం అందజేశారు.


ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ మొగలగాని మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీపీ క్యాసగళ్ల అనసూయ, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ ,పట్టణ సెక్రెటరీ జనరల్ కుండే సంపత్ ,కౌన్సిలర్ యాట శివ, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, కొలుపుల హరినాథ్, మాదాని ఫిలిప్స్ ,జల్లి నరసింహులు, జింకల రామకృష్ణ యాదవ్, జూకంటి చిన్న ఉప్పలయ్య, యూత్ అధ్యక్షుడు పూల శ్రావణ్, పాకాల హరీష్, పాసికంటి శ్రీనివాస్, జింకల భరత్ యాదవ్, ఎలుగల హరికృష్ణ ,వసపరి రవి, కటకం మల్లేష్ ,అరిగ చంద్రశేఖర్, ఎండి ఫయాజ్, మంగ అరవింద్, టింకు, మొగిలిపాక కృష్ణ, పల్లె మహేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్