నవతెలంగాణ-మద్నూర్
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) బలోపేతానికి అన్ని విభాగాలు శ్రమించాలి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ,సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు జరుగుతుందని ఆ సధస్సు విజయవంతానికి అన్ని మండలాలు, కాలేజీ ల నుండి మాదిగ విద్యార్దులను తరలించవలసిన బాధ్యత ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల నాయకులపై ఉందని గుర్తు చేస్తున్నాం.
రాబోయే రోజుల్లో మాదిగ విద్యార్థుల పాత్ర అన్ని రంగాల్లో చాలా క్రీయాశీలకంగా ఉండబోతున్నదని, అందుకు అనుగుణంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ విద్యార్థి సమాఖ్య సంస్థాగత నిర్మాణాలు బలోపేతం చేయాల్సిన బాధ్యత ఎమ్మార్పీఎస్ పైనే ఉందని గుర్తు గుర్తు చేస్తున్నామన్నారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాల ముఖ్య నాయకుల సమావేశం లో కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా సీనియర్ నాయకులు సూర్య వంశీయాదవ్ మాదిగ,మావురం శ్రీకాంత్, బాలు యాదవ్,బోట్కె హన్మంతు, దర్శన్ గంగాధర్,బుజంగ్,విజయ్, దశరథ్, మారుతి, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)