Magazines

ఘనంగా బైసా కట్టమల్లు 40వ వర్ధంతి 

50 నిమిషాల క్రితం

cpi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బైసా స్వామి 

సిపిఐ మండల సహాయ కార్యదర్శి తుటి వెంకటరెడ్డి

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని మునిగలవీడు గ్రామ స్వాతంత్ర సమరయోధుడు సిపిఐ నాయకుడు కామ్రేడ్ బైస కట్టమలు 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించినట్లు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బైసా స్వామి,సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి తుటి  వెంకటరెడ్డి తెలిపారు. ఆయన చిత్రపటానికి సోమవారం పూలమాలవేసి ఘనంగానే వాళ్ళ అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైజాం రాజరిక వ్యవస్థకు జమీందారీ భూస్వామ్య విధానాల రద్దు కోసం ఆ రోజులలో పౌరసత్వ హక్కుల సమావేశాలు జరుపుకునే వీలు లేదు అని అన్నారు.

సభలు సంఘాలు పెట్టుకునే అవకాశం అసలే లేదు. దోపిడి పెద్దందారులు ఏది శాసిస్తే అదే అమలు జరిగేది అని చెప్పారు. ఇండ్లపై దూకుడు చేసి పంట పొలాల్లో పడి లూటీ చేసిన ఆడపడుచులకు  ప్రాణ రక్షణ లేదు లేకుండా పోయిందని అన్నారు.  పెతందారులు జమీందారు సాగించే చర్యలను దోపిడీ వ్యవస్థను పుకుడి వేళ్ళతో కూల్చివేయాలని కొండపల్లి గోపాల్ రావు ఆధ్వర్యంలో బైసా కట్టమల్లు, వాసిరెడ్డి కృష్ణారెడ్డి ,వారి పల్లి నరసయ్య, మండల గోపాల్ ,తదితరులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినారు అని తెలిపారు. బైసా కట్టమలు రాజమండ్రి జైల్లో గుల్బర్గా జైలు అనుభవించినారు అని చెప్పారు ఆయనకు గొప్ప చరిత్ర ఉందని ఈ సందర్భంగా తెలిపారు. వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో  లక్ష్మణ్ , ఉమా, శ్యామ్,  రఫీ, దస్తగిరి, ఈ వెంకట మల్లు, బి నాగరాజు,  పి నాగరాజు, కే మల్లయ్య , పైసా రాజేష్ గుంటూరు శీను, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్