మహబూబాద్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ అనిల్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని ఆలేరు గ్రామంలో భూభారతిలో భాగంగా భూరి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మహబూబాబాద్ జిల్లా అదనప కలెక్టర్ అనిల్ తెలిపారు. శనివారం ఆలేరు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అలేరు గ్రామంలో రీ-సర్వే కార్యక్రమంపై గ్రామసభ మరియు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్,, ఏ డి ఎస్ ఎల్ ఆర్ శ్రీనివాసులు తహసీల్దార్ చందా నరేష్ తో కలిసి, సర్వే కార్యక్రమం ఈరోజున ప్రారంభం అవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా రీ-సర్వే యొక్క ఉద్దేశ్యం, భూముల సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల నవీకరణ తదితర అంశాలపై రైతులకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. రీ-సర్వే ప్రక్రియలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించి, సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అలాగే, భూ హక్కులు మరియు భూ రికార్డులకు సంబంధించిన వివరాల విషయంలో రైతులు అపోహలకు లోనుకాకుండా, అధికారుల సూచనలను పాటిస్తూ రీ-సర్వే ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చందా నరేష్, శ్రీనివాసులు, జిపిఓ జనార్ధన్ రిసర్వ్ సిబ్బంది పాల్గొన్నారు







కామెంట్లు (0)