సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్
ముగిసిన విమలక్క ‘ప్రజాకళాజాతర’
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణానికి భావసారూప్యత కలిగిన విప్లవ, ప్రజాస్వామిక శక్తులు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపంలో మూడ్రోజులుగా నిర్వహించిన విమలక్క ‘50 గంటల ప్రజా కళాజాతర’ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత వర్గాలు, సమూహాల సమస్యలకు ఈ వేదిక గొంతుకగా నిలిచిందన్నారు. ఈ ఉద్యమం తెలుగు నేలకే పరిమితం కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజా కళాజాతరగా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గాయని నేహా సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
విమలక్క మాట్లాడుతూ.. 50 గంటల ప్రజా కళాజాతర వ్యక్తిగత వేడుక కాదని, సాంస్కృతిక ఉద్యమాన్ని తర్వాతి తరాలకు అందించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
50 పాటలు, 50 ప్రదర్శనలు, 50 ప్రసంగాలతో కళాజాతరను నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విప్లవ, ప్రజాస్వామిక శక్తులు ఒక్కతాటిపైకి రావాలి
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)