అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం ఇప్పుడు మరింత భారీ స్థాయిలో విస్తరించబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. తొలి భాగం అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ఈ సీక్వెల్ పై అంచనాలు మరింత పెరగడంతో ఇది దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది. ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటీనటులు వచ్చే నెల నుంచి తమ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. భారీ షెడ్యూల్‌తో షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అలాగే మొత్తం ప్రొడక్షన్‌ను 2027 ప్రథమార్థానికి పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.







కామెంట్‌లు (0)