Magazines

‘జై జై రామ్‌’తో మ్యూజికల్‌ జర్నీ షురూ..

3 గంటల క్రితం

Jai Jai Ram
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం

‘రామాయణం’ మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాట ‘జై జై రామ్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేసి, మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించగా, దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. ఈ పాటలో శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ఈ పాట విడుదల నేపథ్యంలో ఫిల్మ్‌మేకర్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘శ్రీరాముడు ‘రామాయణం’కు హృదయం. తరతరాలుగా జీవితంలోని ప్రతి దశలో మనం ఆయనను మార్గదర్శిగా భావిస్తున్నాం. ఈ పాట శ్రీరాముడితో మనకున్న వ్యక్తిగతమైన, శాశ్వతమైన అనుబంధం నుంచి వచ్చింది. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకి అసలైన పునాది భావోద్వేగం, విలువలు, భక్తి’ అని తెలిపారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్‌ఈజీ, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ‘రామాయణం పార్ట్ వన్’ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్