విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తు న్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్గా ఈ సినిమా విడుదలపై పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ శుక్రవారం మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీతో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తన మాతృభూమిని, తన ప్రజల్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేసి వీరతిలకం పెట్టుకున్న యోధుడు రణబాలిగా విజయ్ దేవరకొండ మెస్మరైజింగ్ లుక్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో విజయ్, రశ్మిక కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే "రణబాలి" సినిమా ట్రైలర్ ను, మిగతా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.







కామెంట్లు (0)