నవతెలంగాణ-హైదరాబాద్ : నాగాలాండ్‌లో కల్తీ మద్యం సేవించి రెండు రోజుల్లో 19 మంది మృతి చెందారు. మొకోక్‌చుంగ్ జిల్లాలో 8 మంది, టుయెన్‌సాంగ్ జిల్లాలో 11 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై అదనపు ఎస్పీ ఐ. బుంగ్‌లాంగ్ చాంగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి, కల్తీ మద్యం మూలం, సరఫరా వ్యవస్థపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కారణం నిర్ధారించేందుకు నమూనాలను గువాహటికి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పోలీసులు జరిపిన రైడ్స్‌లో 19 మందిని అరెస్టు చేసి, దాదాపు 3 వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.







కామెంట్‌లు (0)