Magazines

టీ20 చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు

2 రోజుల క్రితం

టీ20 చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఫార్మాట్‌లో 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌తో భారత్‌ ఈ అరుదైన ఘనత అందుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ సహా మిగతా జట్లను వెనక్కి నెట్టింది. టీ20ల్లో అత్యధిక విజయాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2006 నుంచి ఇప్పటివరకు 291 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 200 విజయాలు సాధించింది. 81 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. మరో 9 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.


పాకిస్థాన్‌ 176 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు 2005 నుంచి 303 టీ20లు ఆడింది. ఇంగ్లాండ్‌ కౌంటీ జట్లలో సోమర్సెట్‌ 174 విజయాలతో మూడో స్థానంలో ఉంది. లాంకషైర్‌ 166 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో ముంబయి ఇండియన్స్‌ 166 విజయాలతో లాంకషైర్‌తో సమంగా ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 163 విజయాలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. సర్రే కూడా 163 విజయాలతో చెన్నైతో సమానంగా ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్