వాతావరణ సదస్సులో ఐరాస
సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ హెచ్చరిక
అంటాల్యా : శిలాజ ఇంధనాలు వాతావరణ సంక్షోభానికి కారణమవు తాయని, వాటిపై ఆధారపడితే ఆర్థికంగా, భద్రతా పరంగా భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. వాతావరణ మార్పులపై ఐరాస ఆధ్వర్యంలో టర్కీలోని అంటాల్యా నగరంలో సోమవారం అంతర్జాతీయ సదస్సు (కాప31) ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకూ జరిగే ఈ సదస్సులో గుటెర్రెస్ మంగళవారం నాడు ప్రసంగిస్తూ ‘కుటుంబాలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకుంటుంటే తొమ్మిది చమురు కంపెనీలు మాత్రం కేవలం మూడు నెలల వ్యవధిలోనే 95 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించుకునే దిశగా పయనిస్తున్నాయి. అంటే రోజుకు ఒక బిలియన్ డాలర్లు’ అని విమర్శించారు. అయితే ఆ కంపెనీల పేర్లను గుటెర్రెస్ వెల్లడించలేదు.బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిం చే దిశగా దేశాలు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని ఆయన సూచించారు.
విద్యుత్ వినియోగాన్ని పెంచాలి : టర్కీ
సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న టర్కీ పర్యావరణ మంత్రి, కాప31 అధ్యక్షుడు మురత్ కురుమ్ తన ప్రసంగం లో విద్యుదీకరణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా, పరిశ్రమలు, భవనాలలో విద్యుత్ వినియోగాన్ని 2035 నాటికి 35 శాతానికి పెంచా లని పిలుపునిచ్చారు. స్వచ్ఛ మైన ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాతావరణ పరిరక్షణ తో పాటు ఇంధన భద్రత, స్థిరత్వం చేకూరుతాయని చెప్పారు. కాగా టర్కీ తమ దేశంలో విజయవంతమైన వ్యర్థాలు లేని ‘జీరో వేస్ట’ విధానాన్ని ఈ సదస్సు ముందు ఉంచింది. రీసైక్లింగ్ (పునరుత్పత్తి)ని పెంచడం, ఆహార వ థాను అరికట్టడం ద్వారా గ్రీస్‌హౌస్ వాయువులను... ముఖ్యంగా మిథేన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చునని ప్రతిపాదించింది.
ఇజ్రాయిల్‌కు నో ఎంట్రీ
గాజాలో జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ సదస్సుకు ఇజ్రాయిల్‌ను టర్కీ ఆహ్వానించలేదు. ప్రపంచంలో శాంతి లేని చోట వాతావరణ న్యాయం ఉండదని కురుమ్ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా బొగ్గు వినియోగాన్ని తగ్గించాలని, గ్రీన్ ఎనర్జీని పెంచాలని టర్కీ చెబుతున్నప్పటికీ ఆ దేశంలో ఇంకా దాదాపు మూడో వంతు విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత ప్లాంట్ల ద్వారానే జరుగుతోందని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు వేలెత్తి చూపుతున్నాయి. బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయడానికి టర్కీ ఎలాంటి కాలపరిమితి ప్రకటించలేదని గుర్తు చేశాయి. కాగా ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి సుమారు లక్ష మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరిలో 37 మంది దేశాధినేతలు, సుమారు 71 దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఉన్నాయి.






కామెంట్లు (0)