Magazines

అల్బేనియాలో 
విద్యార్థుల ఆగ్రహజ్వాలలు

1 గంట క్రితం

Albania
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

అవినీతి, నిరుద్యోగం, 
నాసిరకం విద్యపై ఆందోళన

ప్రధాని రాజీనామాకు డిమాండ్‌..
నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం

బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లతో అణచివేత

తిరానా: అల్బేనియాలో ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, విద్యా ప్రమాణాల దిగజారుడుపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శనివారం రాజధాని తిరానాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖ భవనం ద్వారం వద్ద నిప్పు పెట్టారు. ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఈ నెలలో చేపట్టిన నిరసనలు తిరానా నగరమంతటా విస్తరించడంతో పాటు ఇతర నగరాలకూ పాకాయి. ప్రభుత్వ భవనాలు, బ్యాంకులకు నిప్పు పెట్టడం, దుకాణాల అద్దాలు పగులగొట్టడం, రోడ్లపై రాళ్లు పెకిలించి పోలీసులపై విసరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వేసవిలో వివాదాస్పద విలాసవంతమైన తీరప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ మద్దతున్న ఈ ప్రాజెక్టుపై స్థానికుల్లోనూ వ్యతిరేకత ఉంది. 2013 నుంచి అధికారంలో ఉన్న రామా గతేడాది నాలుగోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజా నిరసనలు ఆయన ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారాయి. '‘అల్బేనియా ప్రజలు మేల్కొన్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన సాగుతోంది'’ అని నిరసనకారుడు డేనియల్‌ తాహిరి వ్యాఖ్యానించారు. అవినీతి, కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు ఇక రామా పాలనను కోరుకోవడం లేదని మరో నిరసనకారుడు ఒర్గెటా లికాజ్‌ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్