సనా : యెమెన్ ప్రభుత్వ దళాలు హౌతీలపై దాడులను ఉధృతం చేశాయి. రాజధాని సనాపై వ్యూహాత్మక దాడి ప్రారంభించామని సోమవారం తెలిపాయి. ఈ నగరం 2014 నుంచి హౌతీల నియంత్రణలో ఉంది. కాగా బాబ్ అల్-మందెబ్ జలసంధి సమీపంలో పశ్చిమ తీరంలో ఉన్న ధుబాబ్ జిల్లాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నామని యెమెన్ దళాలు చెప్పాయి. అయితే ఈ ప్రకటనను హౌతీలు తోసిపుచ్చారు.
ఇదిలావుండగా హౌతీలను ఓడించడానికి అంతర్జాతీయ సమాజం నుంచి మరింత మద్దతు అవసరమని యెమెన్ విదేశాంగ మంత్రి అఫ్రా అల్-జౌబా కోరారు.
గత 24 గంటల కాలంలో తమ నియంత్రణలో ఉన్న భూభాగంపై సౌదీ అరేబియా 106 వైమానిక దాడులు జరిపిందని హౌతీలు ఆరోపించారు. రాజధాని సనా పైన, అల్-జాఫ్, తైజ్, అమ్రాన్, హజా, సాద్ రాష్ట్రాల పైన సౌదీ యుద్ధ విమానం 106 వైమానిక, క్షిపణి దాడులు చేసిందని హౌతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరీ తన టెలిగ్రామ్ ఖాతాలో తెలియజేశారు. హౌతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై ఎఫ్-15, టైఫూన్ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని ఆయన చెప్పారు.
హౌతీలపై యెమెన్ దళాల దాడులు ఉధృతం
2 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)