కాలయాపనపై టీసీఏ ఆవేదన
ముంబయి : తెలంగాణ గ్రామీణ క్రికెట్‌కు ప్రత్యేక క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు అంశంపై బాంబే హైకోర్టులో విచారణకు ఉన్న రిట్ పిటిషన్‌పై వాదనలు ముగిసినా, ఎటువంటి తీర్పు, ఆదేశాలు లేకుండా వాయిదాలు పడటంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో సోమవారం తుది తీర్పు వస్తుందని ఆశించినా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) న్యాయపరమైన మార్గాలను దుర్వినియోగం చేస్తూ కాలయాపనకు కారణం అవుతోందని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ క్రికెట్ కోసం అవిశ్రాంతంగా పోరాడుతామని టీసీఏ తెలిపింది.







కామెంట్‌లు (0)