నవతెలంగాణ-హైదరాబాద్ : ఐదు రోజుల జాతీయ స్థాయి డ్రెస్సేజ్, షో జంపింగ్ పోటీలు బుధవారం గండిపేట్లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ)లో ఆరంభం అయ్యాయి. నేషనల్ క్వాలిఫయర్ రెండో అంచె, తెలంగాణ ఈక్వెస్ర్టియన్ పోటీలను తెలంగాణ రాష్ర్ట ఈక్వెస్ర్టియన్ అసోసియేషన్ (టీఎస్ఈఏ)తో కలిసి హెచ్పీఆర్సీ నిర్వహిస్తోందని నిర్వాహకులు, హెచ్పీఆర్సీ ప్రెసిడెంట్ చైతన్య ఆర్ కుమార్ తెలిపారు. ఈ నెల 14 నుంచి 16 వరకు డ్రెస్సేజ్, షో జంపింగ్ పోటీలు ఉండనుండగా, 16 నుంచి 18 వరకు తెలంగాణ రాష్ర్ట స్థాయి ఈక్వెస్ర్టియన్ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పోటీపడనున్నారు.
నేషనల్ ఈక్వెస్ర్టియన్ క్వాలిఫయర్ పోటీలు షురూ
56 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)