నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ పండగ సీజన్ లో, జావా, యెజ్డీ మరియు BSA నోమాడ్స్ కమ్యూనిటి భారతదేశంవ్యాప్తంగా 3,00,000 మంది సభ్యులకు వృద్ధి చెందింది, తన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచించింది. మోటార్ సైక్లింగ్ కోసం భాగస్వామ్య అభిరుచి ద్వారా రైడర్స్ ను ఒక చోట చేర్చిన, నోమాడ్స్ కమ్యూనిటీ కొత్త గమ్యస్థానాలు అన్వేషించడానికి, అనుభవాలు భాగస్వామ్యం చేయడానికి మరియు శాశ్వతమైన సంబంధాలను రూపొందించడానికి రైడర్లకు అవకాశాలను కల్పించడం కొనసాగిస్తోంది.
తరతరాలుగా ఉద్వేగభరితమైన యజమానులు కొనసాగించిన వారసత్వంపై ఈ కమ్యూనిటీ నిర్మించబడింది. కొత్త జావా మరియు యెజ్డీ మోటార్ సైకిల్స్ భారతదేశంలో ఉత్పత్తి చేయబడని సమయంలో కూడా, స్వతంత్ర యజమాన సమూహాలు, కలక్టర్లు మరియు ఔత్సాహికులు బ్రాండ్స్ యొక్క స్ఫూర్తిని తమ మోటార్ సైకిళ్లు, రైడ్స్ మరియు పంచుకున్న గాథలు ద్వారా సజీవంగా ఉంచారు. జావా 2018లో భారతదేశానికి వచ్చినప్పుడు, అది అనూహ్యమైన ప్రతిస్పందనను పొందింది మరియు ఒక్క రోజులోనే 1,00,000 కంటే ఎక్కువ బుక్కింగ్స్ ను నమోదు చేసింది, ఇది భారతదేశంలో జావా వారసత్వం యొక్క శాశ్వతమైన శక్తిని ప్రదర్శించింది.
వివిధ ప్రాంతాల్లో నిర్వహించే రైడ్స్ మరియు కమ్యూనిటీ కార్యక్రమాలు ద్వారా, నోమాడ్స్ కమ్యూనిటీ భారతదేశంవ్యాప్తంగా వృద్ధి చెందింది, విభిన్నమైన నగరాలు, సంస్కృతులు మరియు నేపధ్యాలకు చెందిన రైడర్స్ ను ఒక చోట చేర్చింది. కొత్త గమ్యస్థానాలను కనుగొనడానికి, తోటి మోటార్ సైక్లిస్ట్స్ తో సంబంధాలకు మరియు కమ్యూనిటీతో తమ సంబంధాన్ని విస్తృతపరచడానికి జాతీయ మరియు ప్రాంతీయ రైడ్స్ , డీలర్ షిప్ ఆధ్వర్యంలో అవుటింగ్స్, సాంస్కృతిక అనుభవాలు మరియు కమ్యూనిటీ సమావేశాలు వీలు కల్పించాయి. దీనిలో ఐబెక్స్ ట్రయల్, పంజాబ్ ద టోర్, టకట్ సంగ్ ట్రయల్, ధృవ కార్గిల్ రైడ్, ట్రయల్ అటాక్ మరియు రైడ్ టు రూట్స్ వంటి సిగ్నేచర్ ప్రయాణాలు, రైడ్ టు గివ్ బ్యాక్ వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి.
అనుపమ్ థరేజా, సహ-స్థాపకులు, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు, “ మా వారసత్వం ఎల్లప్పుడు అభిరుచి గల రైడర్స్ యొక్క తరాలతో ముందుకు తీసుకువెళ్లబడింది. కొత్త మోటార్ సైకిళ్ల తయారీ లేని సంవత్సరాల్లో కూడా, యజమానులు, స్వతంత్ర కమ్యూనిటీలు తమ మెషీన్లు, రైడ్స్ మరియు పంచుకున్న గాథలు ద్వారా తమ సంబంధాన్ని సజీవంగా ఉంచారు. 2018లో జావా తిరిగి వచ్చినప్పుడు వచ్చిన ప్రతిస్పందన తర తరాల్లో ఈ బంధం యొక్క శక్తిని పునరుద్ఘాటించింది. నేడు, నోమాడ్స్ కమ్యూనిటీ 3,00,000 సభ్యుల సంఖ్యను దాటిన కారణంగా, ఈ మైలురాయి జావా, యెజ్డీ మరియు బిఎస్ఏ రైడర్స్ ను ఒక చోటకు చేర్చిన అభిరుచి మరియు తమ స్వంతం అనే భావనను సూచిస్తోంది. కలిసి రైడ్ చేయడానికి, కొత్త గమ్యస్థానాలు కనుగొనడానికి మరియు శాశ్వతమైన సంబంధాలను రూపొందించడానికి వారి కోసం మరిన్ని అవకాశాలను సృష్టించడాన్ని మేము కొనసాగిస్తాము. ”
జావా, యెజ్డీ మరియు బిఎస్ఏ రైడర్స్ తో శక్తివంతమైన సంబంధాలను రూపొందించడంపై బ్రాండ్స్ యొక్క నిరంతర శ్రద్ధను నోమాడ్స్ కమ్యూనిటీ విస్తరణ సూచిస్తోంది. రైడ్స్ నిర్వహణ, సామాజిక కార్యక్రమాలు మరియు పంచుకున్న అనుభవాలు ద్వారా పాల్గొనడం ప్రోత్సహించడం ద్వారా, కమ్యూనిటీ యాజమాన్య ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది.
భారతదేశంవ్యాప్తంగా 3,00,000 సభ్యులతో, నోమాడ్స్ కమ్యూనిటీ మరింతమంది రైడర్స్ ను ఒక చోటకు తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించింది మరియు రైడ్ చేయడానికి, అన్వేషించడానికి మరియు కలపడానికి వారికి అవకాశాలు సృష్టిస్తోంది. చేసిన ప్రయాణాలు మరియు దారిలో రూపొందిన సంబంధాలు ద్వారా కమ్యూనిటీ జావా, యెజ్డీ మరియు బిఎస్ఏ యాజమాన్యం అనుభవం మరింత అనుసంధానంగా, ఆకర్షణీయంగా మరియు గుర్తుండిపోయేలా రూపొందిస్తూనే ఉంది.




కామెంట్లు (0)