నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్ తగిలింది. వచ్చే నెల డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానని ఆమె చేసిన ప్రతిపాదనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. తన ప్రయాణం కోసం ఢిల్లీ నుంచి ఢాకాకు విమానంతో పాటు ఇతర ప్రయాణ పత్రాలు ఏర్పాటు చేయాలన్న హసీనా విజ్ఞప్తిని ఆ దేశ ప్రభుత్వం నిరాకరించింది. దేశంలోకి అడుగుపెడితే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.‘కాగా.. వచ్చే నెల బంగ్లాదేశ్ లిబరేషన్ డే అయిన 16న తాను తన స్వదేశానికి తిరిగి వెళ్తానని హసీనా వెల్లడించిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)