Magazines

ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పెంపుపై బీసీసీఐ కీలక ప్రకటన

8 గంటల క్రితం

BCCI makes key announcement regarding increase in number of teams in IPL
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఐపీఎల్‌లో ప్రస్తుతం ఉన్న 10 జట్ల సంఖ్యను 12కు పెంచే ఆలోచన లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. 2028 నుంచి 12 జట్లతో ఐపీఎల్ నిర్వహిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. జట్ల సంఖ్య పెంపుపై బోర్డులో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ సీజన్‌ను ఘనంగా నిర్వహించడంపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే, ఫ్రాంచైజీల ఆటగాళ్ల కొనుగోలు పరిమితిని రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచే ప్రతిపాదనపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుందని, డిసెంబర్ 16న నిర్వహించే వేలం ప్రస్తుత సైకిల్‌లో చివరిదని వెల్లడించారు. 2027 ఐపీఎల్ మార్చిలో ప్రారంభం కానుందని, టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపైనే ప్రస్తుతం బోర్డు దృష్టి పెట్టిందని సైకియా పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్