నవతెలంగాణ - హైదరాబాద్ : పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోపై పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ 30 రోజుల నిషేధం విధించినట్లు సమాచారం. కోచ్ జార్జ్ జీసస్‌తో విభేదాల కారణంగా జట్టును వీడినట్లు విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రూ.27 వేల జరిమానా కూడా విధించినట్లు సమాచారం. నేషన్స్ లీగ్‌లో ఆడే అవకాశం ఇవ్వలేదంటూ కోచ్‌పై రొనాల్డో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.
రొనాల్డోపై 30 రోజుల నిషేధం..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)