Magazines

ఎంఐఎం నేత దారుణ హత్య..

2 గంటల క్రితం

MIM Leader
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎంఐఎం నేత మూర్తుజ అలీ దారుణ హత్యకు గురయ్యాడు. హిమాయత్ సాగర్ ఎకో పార్కు సమీపంలో ముర్తుజ పహిల్వాన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు.  తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను వెంటనే అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఆయన మృతి చెందాడు. రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముర్తుజ పైల్వాన్ ఎంఐఎం నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్