Magazines

ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

2 గంటల క్రితం

Fire breaks out at Khairatabad GHMC office
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఓ గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ గదిలో కీలక రికార్డులతో పాటు చెక్కులు కూడా ఉన్నట్లు సమాచారం. మంటలను గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది, ఏయే రికార్డులు దెబ్బతిన్నాయి అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్