నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రం మదురైలోని తనిష్క్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షట్టర్ తాళాలు పగలగొట్టి, గోడకు కన్నం వేసి సుమారు రూ.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కేవలం 15 రోజుల క్రితమే ప్రారంభమైన ఈ షోరూమ్‌లో జరిగిన ఈ భారీ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. షోరూమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
తనిష్క్ జ్యుయెలరీస్‌లో భారీ చోరీ..రూ.50కోట్ల నగలు దోచుకెళ్లారు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)