Magazines

ఆస్ట్రేలియా జాతీయ జట్టు కన్సల్టెంట్ కోచ్‌గా మైకేల్ హస్సీ

9 గంటల క్రితం

Michael Hussey appointed consultant coach for Australia national team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీకి క్రికెట్ ఆస్ట్రేలియా కీలక బాధ్యతలు అప్పగించింది. నవంబర్ 6న ఆయనను ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా నియమించింది. 2027 వన్డే ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్‌, 2028 టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ వరకు ఆయన సలహాదారుగా సేవలందించనున్నారు. గత ఎనిమిదేళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కోచింగ్‌ బాధ్యతలు నిర్వహించిన హస్సీ.. నవంబర్‌ 21న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ ద్వారా తన కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. ఇంగ్లండ్‌ జట్టులో చేరుతారనే ప్రచారానికి తెరదించుతూ.. తన సొంత దేశమైన ఆస్ట్రేలియాకు సేవలందించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్