Magazines

సిద్దిపేట ఆర్టీసీ డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం

3 గంటల క్రితం

Minister Ponnam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ (డీఎం) వ్యవహారశైలిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కార్మికులతో సమావేశమైన సమయంలో డీఎం కుర్చీలో కూర్చోగా, కార్మికులు నేలపై కూర్చున్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఘటనపై ఆయన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీతో మాట్లాడి, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "సిద్దిపేట డిపోలో జరిగిన ఘటన నా దృష్టికి వచ్చింది. ఈ అంశంపై తక్షణమే ఆర్టీసీ ఎండీతో మాట్లాడి, సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించాను. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి" అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్