నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత పోచంపల్లిలో పర్యటించి, అనంతరం హుజూర్‌నగర్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.190 కోట్లతో చేపడుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించి, నూతన వైద్య పరికరాలను ప్రారంభించనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం మిర్యాలగూడలో గృహ నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.
మూడు జిల్లాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యటన
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)