ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత

1 గంట క్రితం

Prominent educationist and author Mangadevi passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, సామాజిక సేవకురాలు డాక్టర్ నన్నపనేని మంగాదేవి (89) శుక్రవారం కన్నుమూశారు. గుంటూరు కేంద్రంగా ఆరు దశాబ్దాలుగా విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలందించారు. 1965లో శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్‌ను స్థాపించి వినూత్న విద్యా విధానాలతో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 1990లో చేతన చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, బాలల విద్య కోసం విశేషంగా కృషి చేశారు. పిల్లల కోసం సుమారు 25 పుస్తకాలు రచించిన ఆమె సేవలకు పలు అవార్డులు, గౌరవాలు లభించాయి. విద్యా, సామాజిక రంగాల్లో ఆమె చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్