Magazines

డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షేక్‌ హసీనా

10 గంటల క్రితం

Sheikh Hasina to return to Bangladesh on December 16
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్వదేశానికి తిరిగి రావడానికి డిసెంబర్‌ 16 తేదీని నిర్ణయించుకున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ విజయ దినోత్సవం రోజున ఢాకాకు చేరుకోవాలని ఆమె భావిస్తున్నట్లు అధికార ప్రతినిధి సయ్యద్‌ మొజమ్మెల్‌ అలీ వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది.

2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన హసీనా అప్పటి నుంచి భారత్‌లో ఉంటున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం ఆమె తరఫు న్యాయ ప్రతినిధులు బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ను సంప్రదించినట్లు సమాచారం.

మరోవైపు, హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. ఈ అభ్యర్థన చట్టపరమైన ప్రక్రియలో పరిశీలనలో ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హసీనాకు మరణశిక్ష విధించగా, ఆమె ఆ తీర్పును రాజకీయ ప్రేరేపితమని ఖండించారు. డిసెంబర్‌ 16న ఆమె తిరుగు ప్రయాణ ప్రకటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్