ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు..టీఎంసీ రెబల్ ఎంపీల ఓట్లలపై అనిశ్చితి

2 గంటల క్రితం

Special Parliament session: Uncertainty surrounds the votes of rebel TMC MPs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఈ నెల 30 (సోమవారం) నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ తో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజన(డీలిమిటేషన్) బిల్లును ప్రవేశ పెట్టాలని మోడీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఆ రెండు బిల్లుల ఆమోదం కోసమే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తన సొంత బలంతో పాటు మిత్ర పక్ష‍ాలను కలుపుకొని సదురు బిల్లుకు కావాల్సిన మద్దతును కూడగట్టే ప్రయత్నాలు తెర వెనుక నుంచి ముమ్మరంగా సాగుతున్నాయి.


మరోవైపు మహిళ బిల్లు మూసుగులో డీలిమిటేషన్ ప్రవేశపెట్టడాన్ని ఇండియా బ్లాక్ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. డీలిమిటేషన్ బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని, ఆ బిల్లుపై స్పష్టమైన చర్చ అవసరమని ప్రతిపక్ష‍ాలు సూచిస్తున్నాయి.


ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన రెబల్ ఎంపీల ఓట్లు కీలకం కానున్నాయి. కాకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలోని 20 మంది ఎంపీలు ఈ ఏడాది జూన్‌లో ఆ పార్టీ నుంచి విడిపోయి, ఎన్‌సీపీఐ (NCPI)లో చేరారు. ఆ తర్వాత వారు ఎన్‌డీఏ (NDA)కు మద్దతు ప్రకటించారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా 20మందిపై అనర్హత వేయాలని టీఎంసీ నేత అభిషేక్ లోక్ సభ సెక్రటరీ పిటిషన్ దాఖలు చేశారు. ఆరు నెలల గడుస్తున్న నేటీ వరకు కూడా టీఎంసీ రెబల్ వర్గానికి చెందిన 20 మంది ఎంపీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సదురు ఎంపీలు పాల్గొనే అవకాశముందని, వారు స్వేచ్చగా తమ ఓటు వినియోగించుకోవచ్చు అని సమాచారం. టీఎంసీ రెబల్ వర్గానికి చెందిన 20 మంది ఎంపీలపై ఎలాంటి సస్పెండ్ ఆర్డర్ లేదు కావునా చర్చలో పాల్గొని, ఓటు హక్కును కలిగి ఉంటారని రాజకీయ నిపుణులు చెప్తుతున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్