Magazines

ఉత్తర కర్ణాటకలో చెరకు రైతుల ఆందోళన

1 గంట క్రితం

Sugarcane farmers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: చెరకు కొనుగోలు ధరను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తర కర్ణాటకలో చెరకు రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. చెరకు టన్నుకు రూ.5,500 ధర నిర్ణయించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు. బెళగావి బస్‌స్టాండ్‌ వద్ద బస్సుల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ధార్వాడ్‌లోని నిగడి గ్రామంలో రైతులు రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


విజయపుర, బాగల్‌కోట జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. చెరకు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కర్ణాటక రాజ్య రైతు సంఘం, హసిరు సేన గౌరవాధ్యక్షుడు శశికాంత్‌ గురూజీ రాష్ట్రవ్యాప్త స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు. రైతుల పోరాటానికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు. రైతులకు సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే సినిమా థియేటర్లను, సినిమాలను బహిష్కరించాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. పాలు, కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల అమ్మకాలను నిలిపివేసి బంద్‌కు మద్దతు తెలపాలని రైతులను కోరారు. చెరకు రైతులు తమ పంటకు లాభదాయకమైన ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్