నవతెలంగాణ - హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కిశ్త్‌వాడ్ జిల్లాలో ఆర్మీతో పాటు ఇద్దరు పోలీసులు పెట్రోలింగ్‌కు వెళ్లి నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలను భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో గుర్తించాయి. మృతులను రష్పాల్ కుమర్ (40), బాబి చంద్ (54)గా గుర్తించారు. వీరు కనిపించకుండా పోయిన ప్రాంతంలో తుపాకీ శబ్దాలు వినిపించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.







కామెంట్‌లు (0)