నవతెలంగాణ-హైదరాబాద్ : యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో భారీ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్ (50 ఓవర్ల మ్యాచ్)లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో 29 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డులన్నింటినీ వైభవ్ బ్రేక్ చేశాడు. 9 ఓవర్లకు భారత్ ఎ స్కోరు 162/2. వైభవ్ (135), రింకు సింగ్ (8) పరుగులతో ఉన్నారు. ఇండియా ఎ టార్గెట్ 250.







కామెంట్లు (0)