నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని పెద్దవాగులో స్వచ్ఛవాగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్దవాగులో పేరుకుపోయిన కంపచెట్లను, చెత్తాచెదారాన్ని జేసీబీ సహాయంతో తొలగించే పనులను చేపట్టామాని పేర్కొన్నారు. పెద్దవాగు పరిసరాలను శుభ్రపరిచి బతుకమ్మ ఆడుకునేందుకు, దసరా పండుగ వేడుకలను సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పండుగల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్ జూకంటి సంపత్, మల్లెల సరిత శ్రీకాంత్, వానరాశి మరియమ్మ మార్కు, జట్ట నీరజ సిద్ధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి మహేష్, మాజీ కౌన్సిలర్ బీతి రాములు, ఆలేరు పట్టణ శ్రీ కనకదుర్గ దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొలుపుల హరినాథ్, ఎలగందుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)