ఆరుగురు అరెస్ట్..
రూ.8,100 నగదు, పేక ముక్కలు, వాహనాలు స్వాధీనం
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీ శివారులోని చెరువు సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.8,100 నగదు, 52 పేకముక్కలు, నాలుగు మోటార్‌సైకిళ్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ టీ. యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నారంవారిగూడెం కాలనీ గ్రామ శివారులోని చెరువు వద్ద ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, పేక ముక్కలు, వాహనాలు, మొబైల్ ఫోన్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






కామెంట్‌లు (0)