- శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు మెరుగుపడతాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామానికి చెందిన మహిళలకు ది మదర్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం అశ్వారావుపేట లోని తన అధికారిక నివాసం లో సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని ఇంటి వద్ద నుంచే టైలరింగ్ పనులు చేపట్టి ఆదాయం పొందాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. శిక్షణతో వచ్చిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టి స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు.
సర్టిఫికెట్లు అందుకున్న మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అందించిన కుట్టు మిషన్ శిక్షణ భవిష్యత్తులో స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఫజిల్ బక్షి, మండల యువ నాయకుడు జూపల్లి ప్రమోద్, వేల్పుల సత్యనారాయణ, కారం శ్రీను, సందీప్, కుంజగోపాల్, ఎస్.కె. నాసిర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)