Magazines

'సాయిస్ఫూర్తి' ఇంజనీరింగ్ కళాశాలలో 'ఆర్టీఎల్ టూ జీడీఎస్II' పై సదస్సు

8 గంటల క్రితం

RTL to GDS II
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

- విద్యార్థులను అభినందించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ‘రిజిస్టర్ ట్రాన్స్‌ఫర్ లెవెల్ (ఆర్టీఎల్) నుంచి గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్ II (జీడీఎస్II)’ అనే అంశంపై ప్రత్యేక ఆహ్వానిత ఉపన్యాస కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) విజయవాడ సెంటర్ వారి సహకారంతో జరిగిన ఈ సదస్సులో ఈసీఈ థర్డ్ ఫోర్త్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు. ​ఈ కార్యక్రమానికి భీమవరం (ఏపీ) విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎం. సుమలత ముఖ్య వక్తగా హాజరై శిక్షణ ఇచ్చారు. కోడింగ్ స్థాయి నుంచి సిలికాన్ చిప్ తయారీ వరకు ఉండే పూర్తి డిజైన్ ప్రక్రియను ఆమె సమగ్రంగా వివరించారు.


లాజిక్ డిజైన్ అండ్  హెచ్‌డీఎల్ కోడింగ్  ప్లిప్ ప్లాప్ ల వంటి ప్రాథమిక లాజిక్‌తో సర్క్యూట్ డిజైన్ చేయడం, వెరిలాగ్/సిస్టమ్ వెరిలాగ్ భాషలలో కోడింగ్ రాయడం, రాసిన ఆర్టీఎల్ కోడ్‌‌ను లాజిక్ గేట్లు, స్టాండర్డ్ సెల్స్‌గా మార్చడం, ఫ్లోర్‌ప్లానింగ్ అండ్ ప్లేస్‌మెంట్ చిప్‌పై సెల్స్‌ను ఎక్కడ ఉంచాలో నిర్ణయించడం, ​క్లాక్ ట్రీ సింథసిస్ (సీటీఎస్) క్లాక్ సిగ్నల్స్ అన్ని సీక్వెన్షియల్ ఎలిమెంట్లకు సమర్థవంతంగా చేరేలా నెట్‌వర్క్ రూపొందించడం, రౌటింగ్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ సెల్స్ మధ్య మెటల్ కనెక్షన్లు ఇవ్వడం, డిజైన్ రూల్స్ (డీఆర్సీ) సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం, జీడీఎస్II అండ్ ఫ్యాబ్రికేషన్  చిప్ ఫైనల్ ఫిజికల్ లేఔట్ ఫైల్ అయిన జీడీఎస్II ద్వారా సెమీకండక్టర్ వేఫర్‌పై నిజమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (ఐసీ) తయారు చేయడం వివరించారు.

​ఈ సదస్సులో హెటిరో ఫార్మాస్యూటికల్స్ అధినేత, రాజ్యసభ సభ్యులు, కళాశాల ఛైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు.


విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ విధమైన శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధ్యాపకులను  అభినందించారు. ​కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందించడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ పాముల శేఖర్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్