Magazines

సింగరేణి సత్తుపల్లి ఏరియాలో ఘనంగా ‘స్వచ్ఛత-6.0’ ప్రారంభం

4 గంటల క్రితం

Swachhta
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సింగరేణి సత్తుపల్లి ఏరియాలోని అన్ని విభాగాల్లో శనివారం ‘స్వచ్ఛత-6.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జీఎం కార్యాలయం, జేవీఆర్, కిష్టారం ఉపరితల గనులు, జేవీఆర్ సీహెచ్‌పీలతో పాటు అన్ని విభాగాల్లో ఈ ఈ స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. ​ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు ఈ నెల 31వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని జీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు.


కార్యక్రమంలో భాగంగా గనులు, అన్ని శాఖల్లో ఉద్యోగులతో పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించి, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, పని ప్రదేశాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం సరికొండ వెంకటాచారితో పాటు ఎస్‌వో టూ జీఎం శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ప్రహ్లాద్, సునీల్ వర్మ, ఏరియా ఇంజనీర్  సోమశేఖర్, వివిధ విభాగాల ప్రాజెక్టు ఇంజనీర్లు, గని మేనేజర్లు, పర్యావరణ అధికారులు హాజరయ్యారు. గుర్తింపు, ప్రాతినిధ్య యూనియన్ల పిట్ సెక్రటరీలు, అధికారులు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు, డీఎల్ఆర్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్