Magazines

అందరూ మెచ్చే ‘సూర్యచంద్రులు

54 నిమిషాల క్రితం

universally
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

’ శ్రీ మాచిరాజు కామేశ్వరరావు జగమెరిగిన బాల సాహితీవేత్త. 14 సంవత్సరాల వయసు నుంచే చందమామకు కథలు రాయటం ప్రారంభించిన వీరు ఒక్క చందమామలోనే 250 కథలు రాశారు. ఇతర పత్రికల్లో 100 పిల్లల కథలు వచ్చాయంటే ఇక వారి గురించి ఏం చెప్తాము? వారి ‘పారిపోయిన దొంగ’ కథను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు, ‘విధి నిర్వహణ’ కథను మహారాష్ట్ర గవర్నమెంట్ వారు తీసుకోవటం ముదావహం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇద్దరు బాల సాహితీవేత్తలకు అవార్డు రూపంగా ఆరువేల రూపాయలు ఇవ్వటం, ఆ వేడుకను ఘనంగా నిర్వహించటం అపురూపమైన విషయమే. మరో విశేషం ఏమిటంటే నాగభైరవ సాహిత్య పీఠం నిర్వహించిన కథా సంపుటిల పోటీలో దాదాపు వంద పుస్తకాలలో ఈ ‘సూర్య చంద్రులు’ పుస్తకం ప్రథమంగా నిలిచి సాహిత్య పురస్కారాన్ని అందుకుంది. ఇక విషయంలోకి వస్తే.. జేపీ పబ్లికేషన్స్ వారు ముద్రించిన వీరి ‘సూర్యచంద్రులు’ చూశాను. ఎంతో ముద్దు వచ్చింది. చక్కటి బొమ్మలతో పిల్లలను అలరించగల పుస్తకం అనిపించింది. ఇందులో 16 కథలు ఉన్నాయి. ప్రతి కథా ఓ సందేశాన్ని అందించేదే. చేయి తిరిగిన రచయిత ఏది రాసినా అది ప్రత్యేకమే అన్నట్లు! ‘దుర్గమ్మ చేసిన పెళ్లి’ కథ పనివాళ్ళని కూడా గౌరవించాలని, అసమానతలను చూడకూడదు అని తెలియజేస్తుంది. ‘స్వార్థం లేని కోరిక’లో స్వార్థం ఎప్పుడూ మంచిది కాదని నిస్వార్థం ఎల్లప్పుడూ శ్రేష్టమే అని, ‘ముఖ పఠనం’ కథలో అబద్ధంతో మనిషిని మార్చటం (చిత్ర లేఖనం) ఎలాగో వివరిస్తే, ‘లీలా- నీలా మధ్యలో మంగమ్మ’ కథ మొబైల్‌ను గంటకంటే ఎక్కువ ఉపయోగించకూడదు అనే పాఠాన్ని నేర్పుతుంది. స్నేహంలో నమ్మకం, నిజాయితీ, విధేయత, పరస్పర అవగాహన ఉండాలని చాటి చెప్పిన కథ ‘సూర్యచంద్రులు’. ‘కొండపాలం కేశవుడు’ అనే కథలో ముఖచిత్రం మారిపోయింది అని ముగింపు వాక్యం అద్భుతం అని చెప్పాలి. ఇలా ఇందులో ఉన్న ప్రతి కథా ఆణిముత్యమే. పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా ఆకర్షించే కథల పుస్తకం ఇదని ఘంటాపదంగా చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? కొనేసెయ్యండి! చదివేసేయండి!


యలమర్తి అనూరాధ, 9247260206

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్