Magazines

తెరల పంజరం

51 నిమిషాల క్రితం

A cage of curtains!
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రపంచాన్ని కుగ్రామం చేసిన మానవాళి మహోదయాన్ని దుర్వినియోగంతో అంధకారంలోకి నెట్టి వెలిగే రంగుతెరల్లో చూపులు పారేసుకొని కళ్లున్న గుడ్డివాళ్ళం అవుతున్నాం చేతిలో వరంతో నేరాలు చేస్తూ మనల్ని మనం శపించుకొంటున్నాం పర్యవసానాల పట్టింపులేక కనులిప్పిన పసికందుల్ని సైతం రగిలే కాంతివలయంలోకి శలభాల్లా నెట్టి భవితను భస్మీపటలం చేస్తున్నాం వేలిమొనకు తలొగ్గాల్సిన వెలుగుతెర వేళ్ళలోంచి లోతుగా వేళ్ళూనుకొనిపోయి కట్టిపడేసినట్టు కళ్ళతోనే ఆటపాటలాడిస్తూ బంధాలకు బంధాలేస్తుంటే ఊబిలో కూరుకొన్న ఊబకాయులవుతున్నాం మనిషి మొక్కకు వాస్తవికత నీరు పోయాలి తెరలపంజరం తెంపి స్వేచ్ఛావిహంగాల్లా ఎగరనియ్యాలి అరచేతుల్లోంచి అంతా కబళిస్తోన్న నీలినీడకు హద్దుగీయాలి సాంకేతికత దారి తప్పకుండా కావలి కాయాలి గాజుతెరను ప్రగతిచక్రంలా పరుగులెత్తించాలి! - భీమవరపు పురుషోత్తమ్, 9949800253

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్