- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ ఆలీ
- యూటీఎఫ్ సత్తుపల్లి మండల మహాసభ
నవతెలంగాణ-సత్తుపల్లి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక టీఎస్‌యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ మండల 13వ మహాసభ జరిగింది. ఈ సభలో రంజాన్ ఆలీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులను వెంటనే చేపట్టాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులుగా సూరయ్య, అశోక చక్రవర్తి
మహాసభలో సంఘ మండల నూతన కార్యవర్గాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధ్యక్షుడిగా హెచ్. సూరయ్య ప్రధాన కార్యదర్శిగా కె. అశోక చక్రవర్తి ఉపాధ్యక్షులుగా ఐ. నాగేశ్వరరావు, టి. పుష్ప శిరీష, కోశాధికారిగా ఎం. మధుసూదనరావు, కార్యదర్శులుగా సి.హెచ్. నిరంజన్, కె. వెంకటేష్, శేషు కుమార్, ఎం. అనసూయ, ఎన్. కళ్యాణ్ కుమార్, ఎ. సాంబశివరావు, పి. నాగరాజు, చింతా శ్రీనివాసరావు ఆడిటర్ గా శేఖర్ ఎన్నికయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా లక్ష్మీకాంతమ్మ, జె. మురళీమోహన్, డి. భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా వేంసూరు మండల బాధ్యులు ఈశ్వరాచారి వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.వి. రామారావు, భద్రాద్రి జిల్లా
కార్యదర్శి ఆర్. రమేష్ కుమార్, ఎం. రాజేశ్వరరావు, భద్రాద్రి జిల్లా మాజీ కార్యదర్శి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ మహాసభలో సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో సంఘ పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.







కామెంట్లు (0)