నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రిని బుధవారం మండల అభివృద్ధి అధికారి పి సాయిలు సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న రోగులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రోగులకు సరైన చికిత్సలు అందే విధంగా చూడాలని కోరారు. ఎంపీడీవో సందర్శన కార్యక్రమంలో ఆస్పత్రి సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్లు (0)