Magazines

మండలంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి  పర్యటన

54 నిమిషాల క్రితం

Rdo
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

దేవాదాయ, రెవెన్యూ, భూ సమస్యల పరిశీలన..
సోమూర్ రీ సర్వే తనిఖీ..

నవతెలంగాణ-మద్నూర్

బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి మంగళవారం మద్నూర్ మండలంలో పర్యటించారు. ముందుగా మద్నూర్ మండల కేంద్రంలో శ్రీలక్ష్మీ నారాయణ దేవాలయ భూమి, కొట్చిర గ్రామాల్లో దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులు, హద్దులు, ఆక్రమణలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


అనంతరం మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను ఆర్డీవో సందర్శించి పరిశీలించారు. గ్రామంలో గ్రామస్థులతో మాట్లాడి సర్వే ప్రక్రియలో వస్తున్న ఇబ్బందులు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా సర్వే చేయాలని, ప్రతి పట్టాదారు భూమికి సరైన హద్దులు గుర్తించాలని సర్వే సిబ్బందికి సూచించారు.భూ రికార్డుల క్రమబద్ధీకరణ, గ్రామాల్లో భూ వివాదాలు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్డీవో తెలిపారు.ఈ పర్యటనలో మద్నూర్ మండల తహసీల్దార్ ఎం.డి. ముజీబ్, మండల గిర్దావర్ మురళీధర్, సర్వేయర్ వెంకట్, ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సోమూరు గ్రామ సర్పంచ్ సంగ్రామ్ పటేల్, తదితరులు ఆర్డిఓ పరిశీలనలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్