నవతెలంగాణ-మద్నూర్
పోచమ్మ తల్లి గ్రామస్తులను చల్లగా చూడాలని బుధవారం ప్రజలందరూ భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోర్కేలు తీర్చే కొంగు బంగారం పోచమ్మ అమ్మవారు అని భక్తులు విశ్వసిస్తారు. తల్లి అనుగ్రహం ఉంటే ఎవరికీ ఏ ఆపదా రాదని నమ్ముతారు. ఈ క్రమంలో మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉషా సంతోస్ మేస్త్రీ దంపతులు సంయుక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తుల మీద మీ కరుణ, దయ ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన మహోత్సవంలో గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్సై మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు అమ్మవారి దీవెనలు అందుకున్నారు.






కామెంట్లు (0)