Magazines

పట్టభద్రుడా.. ఓటు నమోదు చేసుకో.!

9 గంటల క్రితం

MLC ELECTIONS
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదలైయింది. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా గత ఎన్నికల ఓటర్ల జాబితా చెల్లదు.


ప్రతి ఎన్నికకు ముందు పట్టభద్రులైన వ్యక్తులు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 28 నుంచి నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాల పరిష్కారం అనంతరం డిసెంబరు 30న తుది జాబితా ప్రకటిస్తారు. 2027 మార్చిలో ఎన్నికలుం టాయి.ఎన్నికల సంఘం సూచించిన ఫారం-18లో మాత్రమే దరఖాస్తు చేయాలి. నవంబర్ 1,2026 నాటికి డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు నిండిన వారు ceotelaangana.nic.in ఆన్లైన్ సంబంధిత deo/ero/aero కార్యాలయాల్లో అప్పజెప్పాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్